గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023ను విశాఖలో నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అగ్రి,మెరైన్,డిఫెన్స్,ఆటోమోటివ్,ఎలక్ట్రిక్ వెహికల్స్,టూరిజం,హెల్త్ కేర్ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామని ఆయన చెప్పారు. 

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023ను విశాఖలో నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 3,4 తేదీల్లో సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సమ్మిట్ నిర్వహించలేదని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నామని గుడివాడ పేర్కొన్నారు. అగ్రి,మెరైన్,డిఫెన్స్,ఆటోమోటివ్,ఎలక్ట్రిక్ వెహికల్స్,టూరిజం,హెల్త్ కేర్ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామని గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. 

ALso REad:పాదయాత్రపై అమరావతి రైతుల పిటిషన్.. విచారణ ముగిసే వరకు హైకోర్టులోనే మంత్రి అమర్‌నాథ్

భావనపాడు,మచిలీపట్నం పోర్టులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 2024 నాటికి రామాయపట్నం పోర్టు కు మొదటి ఓడ తీసుకోస్తామని.. యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సమ్మిట్ జరుగుతుందని మంత్రి చెప్పారు. సమ్మిట్ కు ముందు పలు దేశాల్లో రోడ్ షోల నిర్వహణ ద్వారా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తామని.. ఏపీలోని పారిశ్రామిక వేత్తలే ఈ సమ్మిట్ కు బ్రాండ్ అంబాసడర్ లుగా ఉంటారని గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు.