శ్రీకాకుళం: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు ఈ వైరస్ బారిన పడ్డారు. కృష్ణదాస్ మంత్రిగా రాష్ట్రస్థాయిలో బిజీగా మారడంతో నియోజకవర్గ స్థాయి వ్యవహారాలను తనయుడు చూసుకుంటున్నాడు. అయితే కరోనా సమయంలోనూ అతడు నియోజకవర్గంలో పర్యటించారు. 

ఇటీవల అతడు కరోనా లక్షణాలతో బాధపడుతూ టెస్ట్ చేయించుకున్నాడు. ఇందులో పాజిటివ్ గా తేలడంతో అతడు చికిత్స పొందుతున్నాడు. కొడుకుకు కరోనా పాజిటివ్ గా తేలగానే మంత్రి కృష్ణదాస్ కూడా అప్రమత్తమై హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మంత్రికి కూడా వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. 

read more   కరోనా ఎఫెక్ట్: ఏపీ స్పీకర్, మంత్రి క్యాంప్ కార్యాలయాల మూసివేత

 శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కృష్ణదాస్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఈ నాయకుల్లోనే కాదు కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులు, ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని కూడా హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. 

తమ క్యాంపు కార్యాలయాలు మూసివేస్తున్నట్లు మంత్రి ధర్మాన, ఏపీ స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. తమను కలిసేందుకు 15 రోజుల పాటు ఎవరూ కూడ రావొద్దని ప్రకటన విడుదల చేశారు.