ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులను శాసనమండలి ఛైర్మన్ ఎట్టకేలకు పరిగణనలోనికి తీసుకున్నారు. రూల్ 71 కింద చర్చ ప్రారంభించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో మండలిలో గందరగోళం నెలకొంది.

Also Read:ఏపి శాసనమండలిలో గందరగోళం... తెలంగాణ మండలికీ గండం: మాజీ మంత్రి దాడి

అంతకుముందు తొలుత రూల్ 71పై చర్చ జరిపి మిగిలిన అంశాలలోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన వైసీపీ సభ్యులు.. ఇది సభా సాంప్రదాయానికి విరుద్ధమని, ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై మొదట చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.

టీడీపీకి సంఖ్యాబలం ఉండటంతో రూల్ 71 కింద చర్చ జరిపేందుకు ఛైర్మన్ షరీఫ్ అనుమతిచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

Also Read:చంద్రబాబుకు ఝలక్: ఇక పోరు పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్యనే.

మంత్రులు స్వయంగా ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై చర్చించాలని నినాదాలు చేశారు. టీడీపీ చెప్పినట్లుగా ఛైర్మన్ నడుచుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స.