Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, అచ్చెన్నల ఇళ్లను ముట్టడించాలి: బొత్స వ్యాఖ్యలు

నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేయాలని చూస్తుందని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ . బుధవారం తాడేపల్లిలోని వైసీపీ  కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారని తెలిపారు.

minister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over housing scheme
Author
Amaravathi, First Published Nov 11, 2020, 3:22 PM IST

నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేయాలని చూస్తుందని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ . బుధవారం తాడేపల్లిలోని వైసీపీ  కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారని తెలిపారు.

చంద్రబాబు హయాంలో ఉండగా ఎప్పుడైనా ఇంత వేగంగా స్పందించారా అని బొత్స నిలదీశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామన్న ఆయన టీడీపీ అధినేత ప్రోద్బలంతోనే నిందితుల తరపున తెలుగుదేశం లాయర్లు వాదించారని ఆరోపించారు.

నంద్యాల ఘటనపై రాష్ట్రమంతటా విచారణ వ్యక్తం చేస్తే.. టీడీపీ తమ లాయర్‌తో నిందితులకు బెయిల్‌ పిటిషన్‌ వేయించారని బొత్స వ్యాఖ్యానించారు. 306 సెక్షన్‌ బెయిలబుల్‌ సెక్షనా? అని మంత్రి ప్రశ్నించారు. బెయిల్‌ రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని బొత్స చెప్పారు. 

పేదలకు ఇళ్లు ఇద్దామంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్తున్నారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటారన్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతల ఇళ్లను దిగ్బంధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు హయాంలో టీడ్కోలో ఒక్క ఇళ్లైనా లబ్దిదారులకు అందిందా అని, పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. టిడ్కోలో భారీ అవినీతి జరిగిందని సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందే చెప్పారని బొత్స గుర్తుచేశారు.

అధికారంలో వచ్చాక 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించారని, 30 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లు ఇస్తామంటే కోర్టులకు వెళ్లి టీడీపీ నేతుల అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిరసన ర్యాలీలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇళ్ల ముందు చేయాలని బొత్స వ్యాఖ్యానించారు

Follow Us:
Download App:
  • android
  • ios