Asianet News TeluguAsianet News Telugu

దోచుకున్న డబ్బుతో హైదరాబాద్‌లో ఇల్లు: చంద్రబాబుపై బొత్స విమర్శలు

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపిస్తే ఎక్కడైనా స్పందన వచ్చిందా అని బొత్స ప్రశ్నించారు. 

minister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over amaravati devlopment
Author
Amaravathi, First Published Oct 22, 2020, 4:55 PM IST

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపిస్తే ఎక్కడైనా స్పందన వచ్చిందా అని బొత్స ప్రశ్నించారు.

కేవలం కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడి నుంచి మాత్రమే స్పందన వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు. మాకు అన్యాయం జరిగిందని ఒక్కరు కూడా రోడ్డు మీదకు రాలేదని.. కేవలం ఈ రెండు ఛానెల్స్‌లోనే పోరాటం జరిగిందంటూ బొత్స ఎద్దేవా చేశారు.

చంద్రబాబు బాధంతా బినామీల కోసమేనని ఆయన ఆరోపించారు. రాజధానిలో చంద్రబాబు 5 శాతం పనులు కూడా చేయలేదని.. కనీసం కరకట్ట కూడా వేయలేదని బొత్స ధ్వజమెత్తారు.

కమ్యూనిస్టులంటే పేదవాడి కోసం నిలబడతారనే నానుడి వుండేదని, కానీ ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలకు ఇల్లు ఇస్తామంటే కోర్టులకెక్కి స్టే తీసుకురావడమెంటో తనకు అర్ధం కావడం లేదన్నారు.

అమరావతి పేరును మాత్రం వాడుకున్న చంద్రబాబు.. అసలు గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని బొత్స ఆరోపించారు. కాలచక్ర ఉత్సవాల సందర్భంగా రాజశేఖర్ రెడ్డి అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు.

ఏం చేయకుండా గ్రాఫిక్స్ కార్డ్ వాడి ఐదు సంవత్సరాలు గడిపేశారని బొత్స ఫైరయ్యారు. ఏపీలో సీఎంగా ఉండి.. దోచుకున్న డబ్బుతో హైదరాబాద్‌లో ఇల్లు మాత్రం పూర్తి చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ఓపిక, వయసు అయిపోయాయని బొత్స చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios