3 రాజధానులను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. కోర్టులో కొన్ని సాకులు చూపాయని, వాటిని అధిగమిస్తామని మంత్రి చెప్పారు.
3 రాజధానులను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. కోర్టులో కొన్ని సాకులు చూపాయని, వాటిని అధిగమిస్తామని మంత్రి చెప్పారు.
పవన్ పాదయాత్ర కాకుంటే.. తలకిందులు యాత్ర చేసుకోవచ్చని బొత్స సెటైర్లు వేశారు. తిరుపతి ఎన్నికకు, పవన్‌ను సీఎం చేస్తామన్న స్టేట్‌మెంట్‌కు సంబంధమేంటోనని మంత్రి దుయ్యబట్టారు.
విభజన చట్టంలోని హామీలను బీజేపీ ఏమైనా నెరవేర్చిందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తిరుపతి సభలో మోడీ ఏం చెప్పారు.. ఏం చేశారని మంత్రి ఎద్దేవా చేశారు.
అలాంటి పార్టీ ఇప్పుడు సీఎం చేస్తాం, పీఎం చేస్తామంటే ప్రజలు నమ్మరని మంత్రి వెల్లడించారు. ప్రజా మద్ధతు లేదు కాబట్టే బీజేపీ పవన్ పేరు.. టీడీపీలోని ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటోందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
కాగా, తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తరపున పవన్ కల్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారు. అనంతరం శంకరంబాడి సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు