ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌పై దాడి ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియాపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌పై దాడి ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియాపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నం ఘటనపై క్షుణంగా దర్యాప్తు చేయాలని ఆరోజు నుంచి ఈరోజు వరకు తమ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఇచ్చిన రిపోర్టును వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ తానే దాడి చేయించుకున్నారని విషప్రచారం చేస్తున్నారని.. ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగనే దాడి చేయించుకున్నారని చంద్రబాబుకు ఎన్‌ఐఏ చెప్పిందా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ క్షుణంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఎందుకు జగన్‌పై దాడి చేశాడో తేల్చాలని అన్నారు. 2003లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసి హత్యాయత్నం చేసింది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్ధం కోసం ఆ హత్యాయత్నం జరిపించుకున్నారా? అని ప్రశ్నించారు. అసలు ఏమైనా జ్ఞానం ఉందా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు, రాతలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనేది తమ నినాదమని మంత్రి బొత్స చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని తాము ఢిల్లీలో పోరాడుతున్నామని చెప్పారు.