సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుంచి స్కూళ్లు పున: ప్రారంభిస్తామని తెలిపారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జూన్ 28న అమ్మఒడిని అందిస్తామని మంత్రి వెల్లడించారు.
 

జూన్ నెల మొదటివారం వచ్చేయడంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు , విద్యా సంస్థలు తెరిచేందుకు ఆయా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కొన్ని చోట్లు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, ఎండలు మండిపోవడంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నారు. ఏపీలోనూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా వుండటంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్కూళ్ల పున : ప్రారంభంపై గందరగోళం నెలకొంది. దీంతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 

జూన్ 12 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభమవుతాయని, విద్యార్ధులకు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరులో సీఎం జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యాకానుకను అందజేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జూన్ 28న అమ్మఒడిని అందిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే 6వ తరగతి నుంచి 12 వరకు డిజిటల్ విద్యను ప్రారంభిస్తామని, ఈ నెల 12 నుంచి ప్రతీ స్కూల్‌లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

ALso Read: చల్లటి కబురు: కేరళను తానికి నైరుతి రుతుపవనాలు

కాగా.. కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకినట్లు ఐఎండీ  ప్రకటించింది. దీంతో పలు ప్రాంతాల్లో బుధవారం నాడు వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా  సముద్రం మీదుగా  అల్పపీడనం  ఏర్పడింది. దీని తీవ్రతతో  వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని  ఈ నెల  5వ తేదీన  వాతావరణ  శాఖ  తెలిపింది.

ఈ నెల 8, 9 తేదీల్లో  కేరళలో  రుతుపవనాలు  తాకే అవకాశం ఉందని గతంలోనే  ఓ ప్రైవేట్  వాతావరణ సంస్థ పేర్కొంది.  సాధారణంగా  నైరుతి రుతుపవనాలు  జూన్ తొలి రెండు రోజుల్లోనే కేరళను తాకుతాయి. అయితే  ఈ ఏడాది ఏడు రోజులు ఆలస్యంగా కేరళలోకి రుతుపవనాలు  ప్రవేశించాయి. 48 గంటల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. త్వరలోనే తమిళనాడు,  కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.