సొంత పార్టీ నేతలపై ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి బొత్స సత్యనారాయణ. మాకు బాధలు లేవా.. యూజ్‌లెస్ ఫెలో, పోటుగాడివా అంటూ తనకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన నాయకుడిపై బొత్స ఫైర్ అయ్యారు.

ఎప్పుడూ సంయమనంతో వ్యవహరించే వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కోపంతో ఊగిపోయారు. సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన స్థానిక వైసీపీ నేతలు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసేందుకు బొత్స దగ్గరకి వెళ్లారు. అయితే ఎమ్మెల్యే పక్కన వుండగానే ఫిర్యాదు చేయడంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడానికి ఇది సమయం కాదని విజయనగరం రావాలంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మాకు బాధలు లేవా.. యూజ్‌లెస్ ఫెలో, పోటుగాడివా అంటూ బొత్స ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.