ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్ కోరిన గంటకే షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని బొత్స నిలదీశారు.

ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ మొండిగా వ్యవహరిస్తే ఎలా అని మంత్రి దుయ్యబట్టారు. 30 కేసులు కూడా లేని సమయంలో ఎన్నికలను వాయిదా వేశారని బొత్స గుర్తుచేశారు.

Also Read:రాష్ట్రంలో ఆ ఇద్దరు వ్యక్తులదే కుట్ర: బొత్స సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎవరి కోసం పనిచేస్తున్నారని... ప్రభుత్వంతో సంప్రదించకుండానే షెడ్యూల్ ప్రకటిస్తారా అని బొత్స మండిపడ్డారు.

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఎస్ఈసీ ప్రవర్తిస్తున్నారని.. ఎవరి తరపున ఎన్నికల కమీషన్ పనిచేస్తోందని సత్యనారాయణ ప్రశ్నించారు. ఎస్‌ఈసీ వెనుక రాజ్యాంగేతర శక్తి ఉందనిపిస్తోందంటూ బొత్స ఆరోపించారు.