ప్రజావేదిక కూల్చివేతపై స్పందించారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజావేదిక అక్రమ నిర్మాణం కనుకనే సీఎం వైఎస్ జగన్ దానిని కూల్చివేయాలని నిర్ణయించారని బొత్స తెలిపారు.

రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల సమావేశంలో జగన్ తన నిర్ణయాన్ని చెప్పినట్లు బొత్స గుర్తు చేశారు. టీడీపీ నేతలపై ఎలాంటి కక్షలతో ఈ ప్రజావేదికను కూల్చడం లేదని బొత్స స్పష్టం చేశారు.

ప్రజావేదికను కూల్చే ప్రక్రియ కొనసాగుతుందని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న ఇంటి వ్యవహారాన్ని ఆయన విజ్ఞతకే విడిచిపెడుతున్నామని.. బాబు కుటుంబం భద్రతా అంశంలో నిబంధనలను అనుసరించాలని.. ఈ విషయంలో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని బొత్స స్పష్టం చేశారు.