Asianet News TeluguAsianet News Telugu

మేం స్కూల్స్ మూశామా.. ఒక్కటి చూపించండి : టీడీపీకి మంత్రి బొత్స సవాల్

తాము రాష్ట్రంలో ఎక్కడా ఒక్క స్కూల్ కూడా మూయలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బైజూస్‌తో ఒప్పందం వల్ల 40 లక్షల మంది పిలలకు ప్రయోజనం కలుగుతోందని ఆయన తెలిపారు. 
 

minister botsa satyanarayana challenge to tdp leaders over schools shudown
Author
Amaravati, First Published Jul 7, 2022, 5:30 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై మీడియాలో వస్తున్న కథనాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) స్పందించారు. గురువారం మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క బడి కూడా మూతపడలేదని స్పష్టం చేశారు. ఏపీ విద్యా రంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానానికి అనుగుణంగా ఇవి జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రతీ ఒక్కరికి విద్యను అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఇందుకోసం సీఎం జగన్ తీవ్రంగా (ys jagan) శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. 

పిల్లలను బడి బాట పట్టించడానికే తాము అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టామని.. రాష్ట్రంలోని 42,750 స్కూల్స్‌‌కి గాను 5,280 స్కూల్స్‌ని మ్యాపింగ్ చేశామన్నారు. సెంట్రల్ స్కూల్స్ విధానం కింద ప్రతి సబ్జెక్ట్‌కి టీచర్ ను నియమించామని ఆయన పేర్కొన్నారు.  బైజూస్‌తో ఒప్పందం వల్ల 40 లక్షల మంది పిలలకు ప్రయోజనం కలుగుతోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయాల కోసం లేని దానిని ఉన్నట్లుగా చూపించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాల విద్యార్ధులతో ఏపీ విద్యార్ధులు పోటీపడే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దమ్ముంటే తాము మూసేశామని చెబుతున్న ఒక్క స్కూల్‌ని చూపాలని ఆయన సవాల్ విసిరారు. 

ALso REad:పిల్లలను స్కూల్‌కి పంపితేనే ‘అమ్మ ఒడి’ .. తేల్చేసిన మంత్రి బొత్స

అంతకుముందు అమ్మఒడి పథకం (amma vodi) లబ్ధిదారులను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు చేస్తోన్న విమర్శలపై కొద్దిరోజుల క్రితం బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు.  అబ్ధిదారుల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు ఆధారంగానే లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి అన్నారు. అమ్మఒడి డబ్బులలో రెండు వేల రూపాయల కోతను పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. ఇంటర్ ఫలితాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని సత్యనారాయణ ఆయన పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios