మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యిందన్న ఆయన మున్సిపల్ ఎన్నికలపై మంత్రులందరం సమావేశమయ్యామని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పంచాయతీల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ లో కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చిందన్న ఆయన పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రణాళికలు గెలిచిన పాలక మండళ్లు ముందుకు తీసుకుని వెళతాయని అన్నారు. 

ఇక సమాచార శాఖ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం, వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని, ప్రజలు మా పక్షాన ఉన్నారని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న పరిపాలన వారికి అందించామని అనుకుంటున్నామని ఆడలేని వారు మద్దెల ఓడు అంటారని ఆయన అన్నారు. 

ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చిన తేడా ఏముంటుంది? అని ఆయన ప్రశ్నించారు. తిరిగి నోటిఫికేషన్ డిమాండ్ వాళ్ల వైఫల్యాలు కప్పిపుచుకోవడానికేనని ఆయన అన్నారు.