నాలుగురోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఆయన నాలుగేళ్ళ అభివృద్ధి గురించి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి బీజేపీ మోసం చేస్తే జగన్‌, పవన్‌లు సీఎంను తిట్టడాన్ని దుయ్యబట్టారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ ఇక నుంచైనా టీడీపీ నేతలపై బురద జల్లడం మానేసి.. రాజకీయాలు నేర్చుకోవాలని హితవు పలికారు.

నోటికివచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. నల్లజర్ల మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి విచ్చేసిన ఆయన పవన్‌పై మండిపడ్డారు. నాలుగురోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఆయన నాలుగేళ్ళ అభివృద్ధి గురించి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి బీజేపీ మోసం చేస్తే జగన్‌, పవన్‌లు సీఎంను తిట్టడాన్ని దుయ్యబట్టారు.

నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రిని తిట్టడానికి నోరు ఎలా వస్తుందని.. మీరు మనుషులేనా అని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కూర్చీ కోసం అమలు కాని వాగ్దానాలు చేస్తున్నారని 40 సంవత్సరాలకే పింఛన్‌ ఇస్తామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దొంగలకు, దోపిడీదారులకు రాష్ట్రాన్ని అప్పగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు.