విశాఖపట్టణం: చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ప్రజలకు భ్రమలు కల్పించారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై  సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు.

Also read::జగన్ ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పావో గుర్తుందా: పవన్ కళ్యాణ్

మంగళవారం నాడు విశాఖపట్టణంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఆయన దత్తపుత్రుడు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

కోడిగుడ్లపై ఈకలు పీకడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించిన తర్వాతే  మూడు రాజధానులపై ముందుకు వెళ్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.