సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ లాంటివారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. నేడు దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని.. వైఎస్ రాజశేఖర్  రెడ్డిని స్మరించుకున్నారు.

ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. తండ్రి బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా అభివృద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.