Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్లలో హైదరాబాద్ తో వైజాగ్ పోటీ...: మంత్రి అవంతి శ్రీనివాస్

అమరావతితో పాటు కర్నూల్, విశాఖపట్నంలో కూడా అభివృద్ధి జరుగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

minister avanthi srinivas comments on three capitals akp
Author
Visakhapatnam, First Published Jun 23, 2021, 8:06 PM IST

అమరావతి: జగన్ అమరావతిని అభివృద్ధి చేస్తారు... ఇక్కడే శాసన రాజధాని కొనసాగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అమరావతితో పాటు కర్నూల్ లో కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు. విశాఖపట్నంకు అన్ని రకాల హంగులు వున్నాయని... మెట్రో స్థాయి నగరం అన్నారు. ఐదు సంవత్సరాలకయినా హైదరాబాద్ తో విశాఖ పోటీ పడుతుందన్నారు మంత్రి అవంతి.

''ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాదులోనే జరిగింది. కాబట్టి అభివృద్ధి ఒకచోటే చేస్తే మళ్లీ కథ మొదటికి వస్తుంది. చంద్రబాబు అంతర్జాతీయ నగరాన్ని  గుర్తించి రాజధానిగా అభివృద్ధి చేసి వుంటే సరిపోయేది...ఏమీ చేయలేకపోయారు'' అన్నారు. 

read more  ఇక లేట్ చేయొద్దు... రఘురామపై అనర్హత వేటు వేయండి: స్పీకర్ ఓం బిర్లాకు విజయసాయి లేఖ

తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులపై మంత్రి అవంతి స్పందించారు. ''కృష్ణా, గోదావరి నదుల డౌన్ లో వున్నాం. ఈ నదుల నీటిని ఎక్కువ వాడుకొనే అవకాశం మనకు లేదు. ఈ సమస్యలు వుంటాయనే మనం కలిసి వుండాలని కోరుకున్నాం. రాజకీయాల కోసం విద్వేశాలు రెచ్చగొట్టవద్దు. విడిపోయి ఏడేళ్లు అయ్యింది... పక్క రాష్ట్రాలతో గొడవ పెట్టుకుంటే, విద్వేషాలు రెచ్చగొడితే ఓట్లు పడవు'' అని అన్నారు. 

''లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు రేపటి నుండి ప్రారంభిస్తాం. ప్రభుత్వ బోట్ లను ప్రారంభిస్తాం. ప్రమాదాలు జరుగకుండా 9 చోట్ల కమాండ్ కంట్రోల్ రూంలు పెట్టాం. 1138 మంది ఉద్యోగులను తొలగించకుండా జీతాలు ఇచ్చాం'' అని తెలిపారు. 

'' విశాఖపట్నంకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ షిప్ ను రెస్టారెంట్ చేయనున్నాం. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ల కోసం క్వాలిటీ లిక్కర్ బ్రాండ్ లకు అనుమతి ఇచ్చాం. గండికోటను ప్రత్యేక టూరిజంగా అభివృద్ధి చేయనున్నాం. గండికోటను రాయలసీమకే తలమానికం లాగా అభివృద్ధి చేస్తాం. 13 చోట్ల 7 స్టార్ హోటల్ లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తో పెట్టనున్నాం'' అని మంత్రి అవంతి వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios