ఢిల్లీలో వుంటూ సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కంట్లో నలుసుగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. అనర్హత వేటుపై జాప్యం సమంజసం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

ఢిల్లీలో వుంటూ సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కంట్లో నలుసుగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. అనర్హత వేటుపై జాప్యం సమంజసం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. గతేడాది జూలై 3న రఘురామపై అనర్హత వేటుకు లేఖ ఇచ్చినా చర్యలు తీసుకోలేదని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. 

కాగా, ఎంపీగా వుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ జూన్ 11న స్పీకర్‌ను కలిశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణంరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌కు భరత్ విజ్ఞప్తి చేశారు. 

Also Read:జగన్ గారూ... కరోనా సమయంలో పరీక్షలా?: జగన్ కు రఘురామ మరో లేఖ

కాగా, బెయిల్ మీద విడుదలైన తర్వాత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏదో రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు విధించిన షరతును పాటిస్తూనేవేర్వేరు రూపాల్లో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.