టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఎదుర్కొనలేక టీడీపీ నేతలను చంద్రబాబు బీజేపీలోకి పంపుతున్నారని అవంతి ఆరోపించారు.

శనివారం అవంతి శ్రీనివాస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గంటా శ్రీనివాసరావును చంద్రబాబు బీజేపీలోకి పంపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. ఐదేళ్లలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలోకి వలసలని విమర్శించారు. చంద్రబాబు తమ వద్దకే వస్తారని ఎన్నికల ముందు అమిత్ షా కూడా చెప్పారని మంత్రి గుర్తుచేశారు.