ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ, వైసీపీ  సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ  సభ్యుల తీరుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ రుహుల్లా ప్రమాణస్వీకారం చేస్తుండగా సభలో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మండలి చైర్మన్ వారించినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుల తీరుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాను సభకు రానని వెళ్ళిపోయారని.. కానీ వాళ్ల పార్టీ నేతలకే ఆయనపై నమ్మకం లేక సభకు వచ్చారని ఎద్దేవా చేశారు.

తమ నాయకుడు వైఎస్ జగన్ నమ్మకం మీద నమ్మకంతో ఆయన వెంటన నడిచాం.. 151 మందితో సభలో అడుగుపెట్టామని అన్నారు. కానీ చంద్రబాబు మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని.. అందుకే సభకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లగలదా..? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. టీడీపీకి ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాలని సవాల్ విసిరారు. 2024లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని.. టీడీపీకి ఒంటరిగా పోటీచేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. Pegasus అంశంపై సోమవారం నాడు Andhra Pradesh Assembly లో చర్చ జరిగింది. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను Chandrababu కొనుగోలు చేసి ఎవరిపై ఉపయోగించారో తేలాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేసిందని West Bengal సీఎం Mamata Benarjee అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సాఫ్ట్ వేర్ కొనుగోలు అంశానికి సంబంధించి చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

మమత బెనర్జీ ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే ఈ సాఫ్ట్ వేర్ కొనుగోలుకు తమకు సంబధం లేదని ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు చెప్పారు. అబద్దాలు ఆడాల్సిన అవసరం మమత బెనర్జీకి ఉంటుందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఒకరి కోసం అబద్దాలు ఆడాల్సిన అవసరం మమత బెనర్జీకి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు హయంలోని ఓ ఇంటలిజెన్స్ చీఫ్ పోలీస్ అధికారిలా వ్యవహరించలేదని అంబటి రాంబాబు చెప్పారు.పచ్చ చొక్కా వేసుకొన్న టీడీపీ నేత మాదిరిగా వ్యవహరించారని అంబటి రాంబాబు చెప్పారు. వైసీపీ నేతలందరి ఫోన్లను చంద్రబాబు ట్యాప్ చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. మిత్రపక్షమైన బీజేపీ నేతలపై కూడా పెగాసెస్ ను చంద్రబాబు ఉపయోగించారని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రత్యర్ధి పార్టీని భూ స్థాపితం చేయాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ప్లాన్ గా అంబటి రాంబాబు చెప్పారు. జగన్ టీమ్ ను చిందర వందర చేయాలనేది చంద్రబాబు లక్ష్యమని Ambati Rambabu చెప్పారు. అందుకే చంద్రబాబు పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని అంబటి రాంబాబు చెప్పారు. 

కుట్రలు, కుతంత్రాలు చేయడమే చంద్రబాబు ప్లాన్ అని అంబటి రాంబాబు చెప్పారు.పెగాసెస్ అంశంపై విచారణ చేయాల్సి న అవసరం ఉందని అంబటి రాంబాబు చెప్పారు. వెంటనే ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారన్నారు. ఈ విషయమై చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా కొట్లాడారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. పక్క రాష్ట్రం నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసేందుకు బాబు పెగాసెస్ ను ఉపయోగించారేమోనని రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.