నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరంటే ఊరుకుంటానా..కాపు బిడ్డ ఇక్కడ..!: బాలకృష్ణకు అంబటి చురకలు
శాసనసభలోనే కాదు బయట కూడా మంత్రి అంబటి రాంబాబు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

అమరావతి : అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి సభ్యుల తీరుతో ఏపీ అసెంబ్లీలో యుద్దవాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టిడిపి ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మధ్య వివాదం రేగింది. సభలో బాలకృష్ణ మీసం తిప్పాడంటూ సీరియస్ అయిన అంబటి దమ్ముంటే చూసుకుందాం రా..! అంటూ సవాల్ విసిరారు. ఇలా సభలో ఇద్దరు నేతల మధ్య సాగినమాటల యుద్దం బయటకూడా కొనసాగుతోంది. అంబటి మాటలను బాలకృష్ణ తప్పుబడితే తాజాగా ట్విట్టర్ వేదికన అంబటి కూడా రియాక్ట్ అయ్యారు.
''నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ ! నాది తెలుగు గడ్డ !'' అంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు అంబటి. ఈ ట్వీట్ ను బాలయ్యతో పాటు నారా లోకేష్, టిడిపికి ట్యాగ్ చేసారు మంత్రి అంబటి రాంబాబు.
ఇదిలావుంటే అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై బాలకృష్ణ కూడా స్పందించారు. ముందుగా అంబటి రాంబాబు మీసం తిప్పాడు... మరో నాయకుడు తొడగొట్టాడు... అందువల్లే తానుకూడా తేల్చుకుందాం రమ్మన్నానని బాలకృష్ణ వివరించారు. నటించడం నా వృత్తి... కన్నతల్లి లాంటి ఆ వృత్తిని అవమానించేలా మంత్రి మాట్లాడారన్నారు. అసెంబ్లీ సాక్షిగా వైసిపి సభ్యుల మాటలు బాధాకరమని అన్నారు.
Read More ప్లూటు జింక ముందు ఊదు... జగన్ ముందు కాదు: బాలకృష్ణకు రోజా వార్నింగ్
వైసిపి ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో శాసనసభ జరగడం చాలా బాధ కలిగించే విషయమని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబును జైల్లోకి పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా స్కిల్ డేవేలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు పర్యటనలకు వస్తున్న స్పందన, లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి జగన్ ఓర్వలేకపోయారని... దీంతో ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బాలకృష్ణ అన్నారు.
కేసు పెట్టారు.