వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి చురకలంటించారు.  చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయమని అంబటి ఎద్దేవా చేశారు. 

వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ , చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని అంబటి ఆరోపించారు. పట్టిసీమ పేరుతో దోపిడీ చేశారని రాంబాబు పేర్కొన్నారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రాంబాబు ఫైర్ అయ్యారు. 

రూ.834 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని.. చంద్రబాబు కేవలం దోపిడీ కోసమే కొన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో హడావుడి చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లను సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని మంత్రి సెటైర్లు వేశారు. ఎల్లో మీడియా పిచ్చిపిచ్చి రాతలు రాస్తోందని.. ఈనాడు కక్షపూరితంగా కథనాలు ప్రచురిస్తోందని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: రుషికొండ నిర్మాణాలపై రచ్చ.. సెక్రటేరియట్ అంటూ చేసిన ట్వీట్ డిలీట్ చేసిన వైసీపీ.. అసలేం జరిగిందంటే..!

ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రజలు నమ్మొద్దని.. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను దోపిడీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకుందామని ఎదురుచూస్తున్నారని.. వాలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని రాంబాబు దుయ్యబట్టారు.

పవన్ వాలంటీర్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని.. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయమని అంబటి ఎద్దేవా చేశారు. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా అని మంత్రి సవాల్ విసిరారు. జనసేన కార్యకర్తలను పవన్ ముంచేస్తారని రాంబాబు జోస్యం చెప్పారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని.. విశాఖపై పవన్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయని రాంబాబు స్పష్టం చేశారు. 

రుషికొండను సందర్శించే పేరుతో హడావుడి చేశారని.. కొండలను తొలగించి ఇళ్లు కట్టుకోవడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లో అడుగడుగునా అసహనం కనిపిస్తోందని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాంబాబు స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే చర్యలు తప్పవని.. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి చురకలంటించారు. భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్ట్ చేయడం సాధారణమన్నారు.