Asianet News TeluguAsianet News Telugu

భోగి పండుగ వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్.. ఫుల్ జోష్‌లో..

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
 

minister ambati rambabu dance with tribal women in bhogi celebrations
Author
First Published Jan 14, 2023, 9:49 AM IST

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.


మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులు వేసి సందడి చేయడం అక్కడివారిని అలరించింది. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో అక్కడున్నవారంతా పెద్దగా కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. 

 


ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ఈరోజు సంక్రాంతి వేడుకలు జరగనున్నయి. ఇందుకోసం సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ వేడుకల్లో భాగంగా సీఎం జగన్ దంపతులు తొలుత గోపూజ నిర్వహించనున్నారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గంటారు. ఈ వేడుకల్లో భాగంగా భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. అలాగే పల్లె వాతావరణాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా సెట్స్‌ను తీర్చిదిద్దారు. 

Follow Us:
Download App:
  • android
  • ios