ఏపీలో నారా లోకేశ్ 'కుర్చీ' వ్యాఖ్యల దుమారం .. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ‘‘మడత ’’ పేచి..!!
ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ‘‘కుర్చీ మడతపెట్టి’’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి వైసీపీ నుంచి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.
ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ‘‘కుర్చీ మడతపెట్టి’’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, నువ్వు చొక్కాలు మడతపెట్టి మా మీదకు వస్తానంటున్నావని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అలా వచ్చేస్తే మేం కుర్చీ మడతపెట్టి నీకు సీటు లేకుండా చేస్తామంటూ .. స్వయంగా ఓ ఇనుప కుర్చీని మడతపెట్టి చూపించారు. దీనికి వైసీపీ నుంచి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.
— Ambati Rambabu (@AmbatiRambabu) February 16, 2024
— Ambati Rambabu (@AmbatiRambabu) February 16, 2024
తాజాగా మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో లోకేష్‌కు కౌంటరిచ్చారు. ‘‘కుర్చీ సంగతి తర్వాత .. ముందు నీ నాలుక మడతపడకుండా చూసుకో బాబూ లోకేష్.. ఇక్కడ వున్నది సింహాసనం.. కుర్చీ కాదు మడతపెట్టడానికి అంటూ వరుస ట్వీట్లు చేశారు.
ఆ వెంటనే అంబటి రాంబాబుకు ట్విట్టర్‌లోనే స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి. ‘‘ గతంలో అది సింహాసనమే.. ప్రస్తుతం అది గ్రామ సింహాసనం.. దానికా పేరు తెచ్చిన ఘనత ఎవరిదో నీకు తెలుసుగా అంబటి ’’ అంటూ పేర్కొన్నారు.
— N Amarnath Reddy (@NAmaranathReddy) February 16, 2024
మరో నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అంబటికి కౌంటరిచ్చేలా ట్వీట్ చేశారు. ‘‘ మేం కూడా అదే చెబుతున్నాం అంబటి.. కుర్చీ అయితే మడత పెడతాం.. సింహాసనం అయితే.. దాని మీదున్న శునకాన్ని తరిమేస్తాం.. ఇది ఓకేనా..? ’’ అంటూ వెంకన్న ట్వీట్ చేశారు.
— Budda Venkanna (@BuddaVenkanna) February 16, 2024