మహిళ అని.. రోజాను వదిలేస్తున్నారట

మహిళ అని.. రోజాను వదిలేస్తున్నారట

‘ఆడలేక మద్దెల ఓడన్నట్టు’ అనే సామెత మంత్రులకు బాగా సరిపోయేట్లున్నది. ప్రతిపక్ష ఎంఎల్ఏలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ‘లేస్తే మనిషినికాను’ అంటూ కాళం వెల్లబుచ్చుతున్నారు. అటువంటి మంత్రులు కూడా రోజాను ఏదో మహిళ అంటూ ఉపేక్షిస్తున్నాం అంటూ చెబుతుండటం విచిత్రంగా ఉంది.

ఇంతకీ విషయం ఏంటంటే, ‘ఏదో మహిళ అన్న ఉద్దేశ్యంతో రోజా విషయంలో సంయమనం పాటిస్తున్నాం’..వైసిపి ఎంఎల్ఏ రోజాపై మంత్రి అమరనాధరెడ్డి చేసిన వ్యాఖ్య. విచిత్రమేమిటంటే ఇద్దరూ చిత్తూరు జిల్లా వాళ్ళే. ఇంతకీ మంత్రికి రోజాపై ఎందుకంత కోపమొచ్చింది? అంటే రోజా, చంద్రబాబునాయుడుపై విపరీతమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారట. దాంతో మంత్రికి బాగా కోపం వచ్చింది. అదే విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ, ‘రోజా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మహిళ అని సంయమనం పాటిస్తున్నా’నని ఆయన చెప్పారు.

పైగా తాను ‘పల్లెటూరిలో పుట్టిపెరిగానని, అంతకంటే ఎక్కువగానే మాట్లాడగలను’ అంటూ చెప్పటం గమనార్హం. ‘తాను పుట్టినప్పుడే మూడువేల ఎకరాల భూస్వామిని’ నా కుటుంబంలో ఎవరిపైనా అవినీతి కేసులు లేవ’న్నారు. కేవలం  అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని అమరనాథ్‌రెడ్డి అంటున్నారు. ఇక్కడ విషయం రోజా-చంద్రబాబుది అయితే మద్యలో మంత్రి దూరి తన గురించి డప్పు కొట్టుకోవటమేంటో అర్ధం కావటం లేదు. తాను పుట్టటమే 3 వేల ఎకరాల భూస్వామి అని చెప్పుకున్నారు బాగానే ఉంది. మరి, చంద్రబాబు మాటేంటి?

ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, మహిళలపై దాడులు జరిగినా మహిళా మంత్రులు పట్టించుకోవడంలేదని రోజా చేసిన విమర్శలపై మంత్రి మండిపడ్డారు.  అంతే కానీ మహిళపై జరిగిన అఘాయిత్యం తప్పని మాత్రం చెప్పలేదు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై, అత్యాచారాలపై మంత్రివర్గంలోని మహిళా మంత్రులు నోరు ఎందుకు మెదపటం లేదని రోజా లేవనెత్తిన ప్రశ్నలో తప్పేముంది? మంత్రి ముందు ఆ విషయానికి సమాధానం చెబితే బాగుంటుంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos