ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న మంత్రి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 26, Aug 2018, 5:12 PM IST
Minister Amaranathreddy admitted in govt hospital due to operation
Highlights

కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని..అది నిజమని నిరూపించారు మంత్రి అమరనాథరెడ్డి. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ప్రైవేట్ ఆస్పత్రి కంటే ధీటుగా ఉన్నాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు

పలమనేరు: కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని..అది నిజమని నిరూపించారు మంత్రి అమరనాథరెడ్డి. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ప్రైవేట్ ఆస్పత్రి కంటే ధీటుగా ఉన్నాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  

గత వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి అమరనాథరెడ్డి ఇన్ఫెక్షన్ కారణంగా కారబంకుల్ అనే సమస్యతో ఇబ్బంది పడేవారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ మంత్రి అక్కడ ఎలాంటి శస్త్ర చికిత్స చేయించుకోలేదు. స్వస్థలమైన పలమనేరు చేరుకుని ప్రభుత్వాస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో అక్కడి వైద్యులు మరియు సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 ప్రభుత్వాసుపత్రుల వైపు కన్నెత్తి చూడని వాళ్లకి మంత్రి అమనాథరెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మంత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాస్పత్రులలో వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని... అనుభవజ్ఞులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందడంతోపాటు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వైద్యులు తెలిపారు. 

పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలను అందించడం వల్లే శస్త్ర చికిత్స చేయించుకోవడానికి మంత్రి ముందుకు వచ్చారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకాన్ని కల్గించేలా మంత్రి వ్యవహరించారని సిబ్బంది కొనియాడారు. ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. 

ప్రభుత్వాస్పత్రిలో మంత్రి శస్త్ర చికిత్స చేయించుకున్నారన్న సమాచారం దావానంలా వ్యాపించడంతో స్థానికులు, ప్రజలు చూసేందుకు తరలివచ్చారు. మంత్రి నిర్ణయాన్ని వారు సమర్థించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నమంత్రికి ఆయన సతీమణి రేణుకా రెడ్డి తోడుగా ఉన్నారు. 

loader