Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ రోజు మంత్రి కుంటుంబం ఆళ్ళగడ్డలో ఉందట..!

  • ‘అధికారుల మాట మీద గౌరవంతో తమ కుటుంబసభ్యులందరం ఆళ్ళగడ్డకు వెళ్లిపోయాం’..
  • పోలింగ్ మొదలైన దగ్గర నుండి మంత్రితో పాటు చెల్లెల్లు భూమా మౌనిక, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో కనిపించిన సంగతి అందరూ చూసిందే.
  • మౌనికైతే ఏకంగా వైసీపీ పోలింగ్ ఏజెంట్ల గుర్తింపు కార్డులను కూడా పలుచోట్ల తనిఖీ చేయటం వివాదాస్పదమైంది.
Minister akhila syas her family is in Allagadda during polling day

‘శిల్పా చక్రపాణిరెడ్డి స్ధానికుడు కాకపోయినా, ఓటు హక్కు లేకపోయినా నంద్యాలలో ఎందుకున్నట్లు’? ‘అధికారుల మాట మీద గౌరవంతో తమ కుటుంబసభ్యులందరం ఆళ్ళగడ్డకు వెళ్లిపోయాం’.. ఇది తాజాగా మంత్రి అఖిలప్రియ చెప్పిన్న మాట.

పోలింగ్ జరిగిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ అఖిల చెప్పిన మాటలతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలింగ్ మొదలైన దగ్గర నుండి మంత్రితో పాటు చెల్లెల్లు భూమా మౌనిక, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో కనిపించిన సంగతి అందరూ చూసిందే. మౌనికైతే ఏకంగా వైసీపీ పోలింగ్ ఏజెంట్ల గుర్తింపు కార్డులను కూడా పలుచోట్ల తనిఖీ చేయటం వివాదాస్పదమైంది.

ఇక తమ్ముడైతే గోస్పాడు మండలంలోని పలు కేంద్రాల్లో హల్ చల్ చేసారు. వాస్తవాలిలా  వుంటే, తన తమ్ముడు రౌడీయిజం చేస్తున్నట్లు కొన్ని ఛానళ్ళల్లో అసత్య ప్రచారం జరిగటం తనను బాధించిందని మంత్రి చెప్పటం విడ్డూరంగా ఉంది. పైగా మంత్రి కూడా ఉదయం నుండి నంద్యాల పట్టణంలోనే తిరగటాన్ని అందరూ చూసారు. అయినా తామంతా ఆళ్ళగడ్డకు వెళ్లిపోయినట్లు అడ్డంగా బొంకేస్తున్నారు.

పైగా, నంద్యాలలో ఉండటానికి తాను రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకున్నట్లు మంత్రి చెప్పటం మరింత విచిత్రంగా ఉంది. స్ధానికేతరులెవరూ నంద్యాలలో ఉండకూడదన్నది నిబంధన. అలా అనుమతి తీసుకునేట్లయితే ఒక్క అఖిల అనే ఏముంది? మంత్రులందరూ అనుమతి తీసుకోవచ్చు కదా? వైసీపీ ఎంఎల్ఏలు కూడా అనుమతి తీసుకుంటారు కదా?

ఇక, వైసీపీ గురించి మాట్లాడుతూ, శిల్పా మోహన్ రెడ్డి మరోసారి నంద్యాల వైపు కన్నెత్తి చూడరట. నంద్యాల పోలింగ్ పెద్ద ఎత్తున జరగుతుందని తాము ముందే చెప్పామన్నారు. పోలింగ్ పెద్ద ఎత్తున జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన సంగతి అందరూ చూసిందే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లే జనాలు తమకు ఓట్లేసినట్లు చెప్పారు.

మంత్రి చెప్పిందే నిజమైతే, గడచిన రెండు నెలలుగా డజనుకుపైగా మంత్రులు నంద్యాలలోనే ఎందుకు క్యాంపు వేసినట్లు? ఓటర్లను సామాజికవర్గాల వారీగా ఎందుకు ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేసినట్లు? పూర్తిస్ధాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందెవరో కూడా మంత్రి చెబితే బాగుంటుంది?

పోలింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ తీవ్ర  ప్రయత్నాలు చేసిందని మంత్రి పెద్ద జోక్ పేల్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా తర్వాతే గొడవలు మొదలయ్యాయి. అదికూడా నంద్యాల పట్టణంలోనే. గొడవల్లో టిడిపి నేతలే వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసి కొడుతున్నట్లు స్పష్టంగా వీడియో సాక్ష్యాలున్నాయి. అయినా వైసీపీనే తమపై దాడులు చేసినట్లు మంత్రి చెప్పటం విడ్డూరంగా ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios