చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారా? అవుననే అంటున్నారు మార్కెంటంగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి.

చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారా? అవుననే అంటున్నారు మార్కెంటంగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి. మీడియాతో మాట్లాడుతూ, ఎలాగైనా సిఎం కావాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబును అంతం చేయాలని నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా జగన్ ప్లాన్ వేసినట్లు ఆరోపించారు. సిఎం పీఠంపై కూర్చోవటం కోసమే చంద్రబాబు చనిపోవలని జగన్ కోరుకున్నట్లు ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని నంద్యాలలో జగన్ నీచమైన భాషను ఉపయోగించారట.

అయినా ఎప్పుడో అయిపోయిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారాన్ని ఇపుడే ఆది ఎందుకు ప్రస్తావించారో అర్ధం కావటం లేదు. పాదయాత్రలో భాగంగా జగన్ ఫిరాయింపు మంత్రి జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు. జనాలు కూడా బ్రహ్మరధం పడుతున్నారు. దాంతో మీడియా అటెన్షన్ డైవర్షన్ కోసం మంత్రి చంద్రబాబు అంతానికి కుట్ర అంటూ మొదలుపెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మంత్రి చెప్పినట్లు చంద్రబాబు అంతానికి జగన్ కుట్ర చేసినా తరువాత అవకాశం లోకేష్ కు వస్తుందే కానీ జగన్ ఎలా వస్తుంది?

జగన్ తీవ్రవాద ఆలోచనలు చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ప్యారడైజ్ పేపర్ల జగన్ పై వచ్చిన వార్తలు చంద్రబాబే రాయించారంటూ జగన్ చెప్పటం అవివేకమన్నారు. ప్యారడైజ్ పేపర్లలో వచ్చిన వార్తలు అవాస్తవాలైతే జగన్ న్యాయపోరాటం చేయాలంటూ సవాలు విసిరారు. సరే, మళ్ళీ ఫిరాయింపులపై మంత్రి చిలకపలుకులు పలికారు. స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదిస్తే ఉప ఎన్నికలకు సిద్ధమన్నారు.

తన రాజీనామాను ఆమోదించమని చంద్రబాబును కోరినట్లు మంత్రి తెలిపారు. తనపై జగన్ కానీ జగన్ కుటుంబసభ్యుల్లో ఎవరైనా సరే పోటీ చేయవచ్చని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. దొంగల్లో నెంబర్ వన్ అయిన కొడుకు సిఎం కావాలని విజయమ్మ ఆశీర్వదించటం విడ్డూరంగా ఉందని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేసారు.