జగన్ గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి  పూర్తిగా  తెలియదని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి  పాల్గొని మాట్లాడారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ల కుమారుడు హితేష్.. వైసీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మహానాయకుడు అవుతాడంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. జగన్ గురించి పూర్తిగా తెలీక.. దగ్గుబాటి అలా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలనపై దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గుప్పెడు పనిచేసిన వైఎస్ మహానాయకుడు అయితే.. గంపెడు పనులు చేసిన చంద్రబాబుని ఏమనాలని ఈ సందర్భంగా ఆది ప్రశ్నించారు.