కర్నూల్: ఏపీలో దేవాలయాలపై దాడులు చేసింది హిందుత్వవాదులేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. శనివారం నాడు కర్నూల్ జిల్లా ఆదోనిలో ఆయన మాట్లాడారు. 

ఏపీ రాష్ట్రంలో  బీజేపీ చాలా మౌనంగా దూసుకెళ్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును ఇంటికే పరిమితం చేయాలని బీజేపీ భావిస్తోందన్నారు. ఏపీలో బీజేపీ, హిందూత్వవాదం బలపడుతుందన్నారు.

ఏపీ రాష్ట్రంలో గతంలో దేవాలయాల్లో చోటు చేసుకొన్న ఘటనలపై ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ఏపీలో విపక్షాలు ప్రభుత్వం తీరుపై  తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షాలు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీలో దేవాలయాలపై దాడులను కొన్ని పార్టీలు తమ లబ్ది కోసం వాడుకొంటున్నాయని అధికార వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. దేవాలయాల్లో దాడులకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనల్లో కీలకంగా వ్యవహరించారని డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, టీడీపీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.