ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన సంగతది తెలిసిందే. కాగా.. ఆయనను చూసేందుకు అభిమాని, చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్నినాయుడు( మిలటరీ నాయుడు) తన కుమారుడు వంశీ సాయంతో విశాఖ విమానాశ్రయానికి వచ్చాడు.

పోలీసులు అనుమతించకపోవడంతో వీఐపీ లాంజ్‌కు కొద్ది దూరంలో ప్రయాణికులు వెళ్లే దారి వద్ద వేచి ఉన్నాడు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘ నాయకులతో సమావేశం అనంతరం వైఎస్‌ జగన్‌ కాన్వాయి శారదా పీఠానికి బయలుదేరింది. పది అడుగులు దాటిన తర్వాత మిలటరీ నాయుడుని చూడగానే ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ఆపించి అతడి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.