ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యాజమాన్యం, పోలీసులు క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విజయనగరం జిల్లా : Andhra Pradeshలోని విజయనగరం జిల్లా.. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి fire accident జరిగింది. బెర్రీ ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యాజమాన్యం, పోలీసులు క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. పాత రథ చక్రాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఆలయంలో గోశాల పక్కన ఉంచిన పాత రథ చక్రానికి దుండగులు నిప్పుపెట్టగా.. మంటలు గమనించిన ఆలయ సిబ్బంది ఆర్పివేశారు. ఈ ఘటనలో రథచక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఆ రథం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొంతకాలంగా గోశాల పక్కన ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భక్తులు భావిస్తున్నారు. ఇక, ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా..? లేక ఇంకెవరైనా కావాలని చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.