నెల్లూరు జిల్లా కావలి మండలం దగదర్తి హైవే రోడ్డుపై మంగళవారం రాత్రి దారి దోపిడీ జరిగింది.  ప్రముఖ చైనా కంపెనీ ఎంఐ కి చెందిన స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న లారీపై దుండగులు దాడి చేశారు.

స్మార్ట్ ఫోన్ల లోడ్ తో లారీ వస్తుందన్న ముందస్తు సమాచారం మేరకు దుండగలు ఆ దారిలో కాపు కాశారు. డ్రైవర్‌ను చితకబాది ఫోన్లను వేరే లారీలోకి మార్చకుని ఎత్తుకెళ్లారు. శ్రీసిటీ నుంచి కోటి రూపాయల విలువైన ఫోన్లను లారీలో తీసుకెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.