Asianet News TeluguAsianet News Telugu

Cheating: 15 కోట్ల చీటీ డ‌బ్బుల‌తో వ్యాపారి జంప్‌..

చీటీల వ్యాపారి దాదాపు రూ. 15 కోట్డ డబ్బుతో కనిపించకుండా పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం కలకలం రేపింది. 

Merchant jumps with 15 crore ticket money ..
Author
Guntur, First Published Dec 8, 2021, 8:20 PM IST

అత‌డో చీటీ వ్యాపారి. చాలా న‌మ్మ‌క‌స్తుడు. 25 ఏళ్లుగా అదే గ్రామంలో అంద‌రి ఆధారాభిమ‌నాలు సొంతం చేసుకున్నాడు. దీంతో అత‌డి వ‌ద్ద జ‌నాలు త‌ర‌చూ చీటీలు క‌ట్టేవారు. ఏమైందో ఏమోగానీ అత‌డు రెండు రోజుల నుంచి క‌నిపించ‌డం లేదు. అత‌డి కుటుంబ స‌భ్యులు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో అత‌డు చీటి డ‌బ్బులు తీసుకొని పారిపోయి ఉంటాడ‌ని అంద‌రూ భావిస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ప్రాంతంలోని ఆత్మ‌కూరికి చెందిన ఓ వ్య‌క్తి చీటీల వ్యాపారం చేస్తూ ఉంటాడు. 25 ఏళ్లుగా ఒకే గ్రామంలో ఉండ‌టంతో అంద‌రి న‌మ్మ‌కం చూర‌గొన్నాడు. అత‌డు చీటీల వ్యాపారం నిర్వ‌హిస్తూ ఉండ‌టంతో ఆ గ్రామంలోని చాలా మంది డ‌బ్బులు చీటీ క‌డుతూ ఉంటారు.

https://telugu.asianetnews.com/andhra-pradesh/atrocious-the-priest-who-said-he-was-drunk-stabbed-him-with-knives-and-then-r3qzwd

త‌మ‌కు అవ‌స‌రానికి ప‌నికి వ‌స్తాయ‌ని, పొదుపుగా ఉంటాయ‌నే ఉద్దేశంతో చాలా మంది చీటీలు వేస్తూ ఉన్నారు. ఇలా దాదాపు 300 నుంచి 350 మంది వ‌రకు చీటీలు క‌ట్టారు. అయితే ఉన్న‌ట్టుండి అత‌డు కుటుంబంతో స‌హా క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో బుధ‌వారం ఈ వార్త ఆ గ్రామమంతా విస్త‌రించింది. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బంతా చీటీల రూపంలో దాచుకుంటే ఇలా జ‌రిగిందేంట‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. అంద‌రూ క‌ట్టిన డ‌బ్బు సుమారు 15 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స్థానికులు తెలుపుతున్నారు. అత‌డు తిరిగి వ‌స్తాడో రాడో అంటూ స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios