Asianet News TeluguAsianet News Telugu

సులభంగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్ లో చూసి ఏటీంఎంల లూటీ.. ఆ తర్వాతే ట్విస్ట్....

వీరంతా సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. దీనికోసం ఏం చేయాలా? అని కొద్ది రోజులు ఆలోచించారు. డబ్బులు బాగా ఉండే ఏటీఎంలలో చోరీ చేయడం వల్ల తొందరగా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని ఆలోచన చేశారు. దీనికోసం ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నారు.

men try to theft atm watching youtube videos in chittoor
Author
Hyderabad, First Published Jan 14, 2022, 12:00 PM IST

చిత్తూరు జిల్లా :  youtube లో చూసి ATMలలో డబ్బులు robbery చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను పలమనేరు పోలీసులు గురువారం arrest చేశారు. ఈ మేరకు పలమనేరు డిఎస్పి గంగయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుమూరు మండలం చిన్నమరెడ్డి కండ్రిగ అనే అడవిపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి (41), పొలకల నరేష్ (29), మాధవ రెడ్డి (25), గుడిపల్లి మండలం యామిగానిపల్లికి చెందిన హరి (21)లు తిరుపతి లో ఉంటూ స్నేహితులయ్యారు.

వీరంతా సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. దీనికోసం ఏం చేయాలా? అని కొద్ది రోజులు ఆలోచించారు. డబ్బులు బాగా ఉండే ఏటీఎంలలో చోరీ చేయడం వల్ల తొందరగా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని ఆలోచన చేశారు. దీనికోసం ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నారు.

దాంట్లో చూపించిన మేరకు పరికరాలను కొనుగోలు చేయడం కోసం..చెన్నై వెళ్లారు. కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చారు. ఆ తరువాత ముందుగా ఎట్టేరిలో  రిహార్సల్స్ చేశారు. ఈ నెల 5న నెల్లూరు జిల్లా వేదపాలెం ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. Siren శబ్దం రావడంతో పరారయ్యారు. మరుసటిరోజు పలమనేరులో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 7వ తేదీ రాత్రి పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ బిఐ ఎటిఎంలో చోరీకి ప్రయత్నించారు.

Siren రాకుండా చూసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఏటీఎంలలో చోరీలు పెరిగిపోతుండడంతో బ్యాంకు అధికారులు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏటీఎంలో రహస్యంగా చిప్, మైక్రో కెమెరా అమర్చారు. దీని ద్వారా సమాచారం ముంబైలోని ఎస్బిఐ కార్యాలయానికి చేరింది. వెంటనే అప్రమత్తమైన  అధికారులు ఏటీఎం లొకేషన్ ఆధారంగా పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లే లోపు అక్కడ నుంచి వీరు ఉడాయించారు.  డీఎస్సీ ఆదేశాలతో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. వాహనాల తనిఖీతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దుండగులు వెళ్ళిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న పలమనేరు సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా వెళ్ళింది. కారును పోలీసులు వెంబడించారు. ఆ కారులోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు నేరం అంగీకరించారు.

వారిని సిఐ భాస్కర్, ఎస్ఐ నాగరాజు గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఉపయోగించిన కారు, గ్యాస్ కట్టర్, పరికరాలు, గ్లౌజులను సీజ్ చేశారు ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకున్న స్థానిక ఐడి పార్టీ పోలీసులు  శ్రీనివాసులు, అల్లాఉద్దీన్, ప్రకాష్, శశి, ప్రభాకర్, బాలాజీకి డి.ఎస్.పి రివార్డులు.అందజేసి అభినందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios