ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకులు కూడా పెళ్లీడుకొచ్చారు. అయితే... భర్త లేకపోవడంతే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి కూడా పెళ్లై ఒక కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో.. తన తల్లితో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని ఇంటికి పిలిచి మరీ అంతమొందించారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పల్లిపాలెం గ్రామానికి చెందిన అండ్రాజు వెంకటేశ్వర్లు(45) అదే గ్రామానికి చెందిన బొడ్డు సుశీల కు ఏడు సంవత్సరాలుగా విహేతర సంబంధం ఉంది. ఈ విషయమై పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయతీలు పెట్టినప్పటికీ వెంకటేశ్వర్లు.. సుశీలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు.

Also Read గుంటూరులో వాగులో పడ్డ వ్యాన్: ఆరుగురు మృతి, పలువురికి గాయాలు...

ఇటీవల వారిద్దరి మధ్య చిన్నచిన్న ఘర్షణలు జరగడంతో ఇదే అదునుగా భావించిన సుశీల కొడుకులు దుర్గ ప్రసాద్, నానిలు.. వెంకటేశ్వర్లును చంపడానికి ప్లాన్ వేశారు.  ఇంటికి పిలిచి ప్లాన్ ప్రకారం కర్రలతో కొట్టారు. తర్వాత తీసుకువెళ్లి.. కరకట్ట దగ్గర పడేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కొడుకు తన తండ్రి వెంకటేశ్వర్లను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.

అయితే...అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందాడు.  దీంతో వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.