కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం కలిగించిన జ్యోతి కేసు గురించి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను లోబరుచుకున్న శ్రీనివాస్ అనే యువకుడు... తీరా జ్యోతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రాణం తీసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి.. కేసు తన మెడకు చుట్టుకోకుండా దానిని దుండగుల మీదకు తోచేశాడు. తాజాగా అదే గుంటూరు జిల్లాలో మరో జ్యోతి ఉదంతం వెలుగులోకి వచ్చింది.

తెనాలిలో ఇస్లాంపేటకు చెందిన జ్యోతి అనే యువతిని సత్యనారాయణ అనే యువకుడు నడిరోడ్డుపై గొంతు కోశాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు.