Mekapati Goutham Reddy:స్వగృహానికి చేరిన భౌతిక కాయం, తరలి వస్తున్న అభిమానులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతిక కాయం హైద్రాబాద్ నుండి నెల్లూరుకు మంగళవారం నాడు మధ్యాహ్నం చేరుకొంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి Mekapati Goutham Reddy భౌతిక కాయం Hyderabad నుండి Nelloreకు మంగళవారం నాడు చేరుకొంది. హైద్రాబాద్ Begumpet విమానాశ్రయం నుండి ప్రత్యేక Helicopter లో నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని తరలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి మేకపాటి గౌతం రెడ్డి స్వగృహనికి పార్ధీవ దేహన్ని తరలించారు. గుండెపోటుతో సోమవారం నాడు మేకపాటి గౌతం రెడ్డి సోమవారం నాడు మరణించిన విషయం తెలిసిందే.
గౌతం రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, YCP శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గౌతం రెడ్డి తనయుడు Arjun Reddy ఇవాళ రాత్రికి అమెరికా నుండి నెల్లూరుకు చేరుకొంటారు. బుధవారం నాడు గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులు రేపు నెల్లూరు రానున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు కూడా నెల్లూరుకు చేరుకొన్నారు. రేపు ఉదయం వరకు మేకపాటి గౌతం రెడ్డి ఇంట్లోనే ఆయన పార్ధీవ దేహన్ని ఉంచనున్నారు.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహిస్తారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి ఆయన నివాసానికి పార్ధీవ దేహన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. పార్ధీవ దేహం తరలింపు సమయంలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి గౌతం రెడ్డిని చివరి సారి చూసేందుకు ప్రయత్నించారు. బుధవారం నాడు ఉదయం ఉదయం 11గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మేకపాటి వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యూనివర్శిటీలో సైన్స్ టెక్నాలజీ నుండి M.Sc పట్టాను పొందారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి YS Jagan తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు.
గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతం రెడ్డి పనిచేస్తున్నారు. సోమవారం నాడు ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిడంతో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.