Asianet News TeluguAsianet News Telugu

మనసు కలచివేస్తోంది: తిరుపతి వరదలపై చిరు స్పందన.. బాధితులకు అండగా వుండాలని అభిమానులకు వినతి

గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు జిల్లాను (chittoor floods) వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (chiranjeevi)వరదలు, వర్షాలపై స్పందించారు.  రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా ఆయన కోరారు

megastar chiranjeevi tweets on tirupati floods
Author
Hyderabad, First Published Nov 19, 2021, 4:12 PM IST

గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు జిల్లాను (chittoor floods) వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరి తిరుమల , తిరుపతిలో (tirupati) పరిస్థితులు భయానకంగా మారాయి. తిరుమల ఘాట్ రోడ్డులోనూ.. తిరుపతిలోనూ వరదనీరు పారుతూ భక్తుల్ని, స్థానికులను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక అధికారులు రక్షణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (chiranjeevi)వరదలు, వర్షాలపై స్పందించారు. 

‘‘ గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కోంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా కోరుతున్నాను” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొండపైకి రాకపోకలు సాగించే రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తూ TTD నిర్ణయం తీసుకుంది.  tirumala కొండపైకి కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసివేయగా నవంబర్ 19వ తేదీన(ఇవాళ) కూడా మూసి ఉంచనున్నట్లు టిటిడి ప్రకటించింది. అయితే వర్షతీవ్రత ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. 

ALso Read:తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త... ఏడుకొండలపైకి రాకపోకల పునరుద్ధరణ

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.  తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది తొలగించారు. భక్తుల సౌకర్యార్థం ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోందని అధికారులు తెలిపారు. 

ఇకపోతే.. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ (imd alert)హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan mohan reddy) వర్ష ప్రభావిత చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశ నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్న సీఎం జాగ్రత్తలు సూచించారు. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios