విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తోందని, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? అని చిరంజీవి ప్రశ్నించారు. 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తోందని, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు? అని చిరంజీవి ప్రశ్నించారు. 

ఆయన ఏమన్నారంటే ‘‘ దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ని మహారాష్ట్ర తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయటం ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి ’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

నష్టాల్లో ఉందనే సాకుతో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరణ తప్పదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం విశాఖ ఉక్కు తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు.

కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.

Scroll to load tweet…