మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ వచ్చేసారు. మొన్నటి దాకా.. జగన్, లోకేష్ లను టార్గెట్ చేసిన నాగబాబు.. ఇప్పుడు తన టార్గెట్ ని మార్చుకున్నారు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ.. తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో విడుదల చేశారు.

గతంలో చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ పొరపాటున నోరుజారి..‘‘ ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే.. అవినీతిలో కానీ, అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. చంద్రబాబు చేసిన కామెంట్స్ పై నాగబాబు తనదైన స్టైల్ లో పంచ్ లు వేశారు.

దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలకు ఓ పొడుపుకథ పొడిచారని అందులో ఒక నిజం.. మరో అబద్ధం ఉందని నాగబాబు అన్నారు.  అవి ఏంటంటే.. అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానం అబద్ధమని.. అవినీతిలో నెంబర్ వన్ స్థానం నిజమని.. ఇదే చంద్రబాబు చెప్పారని.. ఇంతకంటే నిజాలు  చెప్పేవారు ఎవరు ఉంటారు అంటూ వ్యంగస్త్రాలు విసిరారు.