Asianet News TeluguAsianet News Telugu

గాంధీ బతికి ఉంటే.. నాగబాబు మరో షాకింగ్ ట్వీట్

మొన్నటికి మొన్న గాడ్సేపై ట్వీట్ చేసి విమర్శలపాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ నేతలు కేసులు కూడా పెట్టారు. ఆ వివాదం ఇంకా ముగియనేలేదు.. తాజాగా.. మహాత్మా గాంధీ పై మరో ట్వీట్ చేశారు. 

Mega brother Naga babu  tweet on Mahatma Gandhi
Author
Hyderabad, First Published May 23, 2020, 10:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో  రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న గాడ్సేపై ట్వీట్ చేసి విమర్శలపాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ నేతలు కేసులు కూడా పెట్టారు. ఆ వివాదం ఇంకా ముగియనేలేదు.. తాజాగా.. మహాత్మా గాంధీ పై మరో ట్వీట్ చేశారు. 

‘‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

 

మొన్నటికి మొన్న.. "ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable.కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు" అని నాగబాబు అన్నారు

."కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అని అన్నారు.

నాథూరామ్ గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు ఆ ట్వీట్ చేశారు. ఆ వివాదం ముగియక ముందే.. ఇప్పుడు గాంధీపై ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios