టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయని సునీత.. ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఆమెకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు.

మ్యాంగో సంస్థ అధినేత రామ్  తో ఆమె ఏడు అడుగులు వేశారు. గత శనివారం రాత్రి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. రెండో వివాహం చేసుకున్న సునీతకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ట్విటర్ ద్వారా స్పందించారు. 

`సంతోషం అనేది పుట్టుకతో రాదు. దాన్ని మనం అన్వేషించి అందుకోవాలి. తమ సంతోషాలను కనుగొన్నందుకు రామ్, సునీతకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి మీ జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్‌గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్` అని నాగబాబు ట్వీట్ చేశారు.