చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు.. (వీడియో)
సీఐడీ అరెస్ట్ చేయడానికి ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
నంద్యాల : నంద్యాలలో శనివారం ఉదయం చంద్రబాబు నాయుడును సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీనికిముందు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు వయసును దృష్టిలో పెట్టుకుని ఆయను హై బీపీ, డయాబెటీస్ ఉన్న నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వ వైద్యులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును పోలీసులు విజయవాడ తరలించనున్నారు.
ఎఫ్ ఐఆర్ లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్టు చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. డిఐజి రఘురామరెడ్డి అడ్వకేట్లను అవగాహన లేని లాయర్లు అంటూ దురుసుగా వ్యాఖ్యానించారు. ప్రాథమిక సాక్ష్యం చూపాలని అడిగితే అన్నీ ఇస్తాం అంటూ విచారణ అధికారులు మాట దాట వేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు.
చంద్రబాబు నాయుడును 52 సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని సీబీఐ తెలిపింది. ఐపీసీ సెక్షన్లు 166, 167,418, 420 కింద కేసులు పెట్టారు. సెక్షన్లు 465,468, 479, 409,201 లు ఆయన మీద పెట్టారు. ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయని చంద్రబాబు లాయర్లు అంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిమీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో నన్నెలా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ చేయలేదు,నోటీసులు ఇవ్వలేదు.. ఏదో జరిగిందని కేసు పెడుతున్నారు అని తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులతో ఆయన అన్నారు.
మీకూ, నాకు రాజ్యాంగమే ఆధారం..ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు...ఆధారాలు ఉంటే ఉరి తీయండి..స్కిల్ స్కామ్ కేసులో నా పేరు ఎందుకు ఉంది...అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. కానీ ముందే రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. విజయవాడ వెళ్లే లోపు రిమాండ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామని వారు తెలిపారు. దర్యాప్తు అధికారి రాకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్లు ప్రశ్నించారు. అరెస్టుకు సంబంధించిన పేపర్లను సీఐడీ పోలీసులు చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆయన లాయర్ రామ చంద్రరావు మీడియాతో అన్నారు. బీపీ ఎక్కువగా ఉంది, ఆయనకు డయాబెటిస్ ఉంది అని తెలిపారు. దీంతో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత సీఐడీ అరెస్ట్ చేయబోతున్నారని తెలిపారు. స్కిల్ డెవల్మెంట్ స్కాం కేసు కింద ఏ1 గా చంద్రబాబును అరెస్ట్ చేశారు.