అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కళ్యాణ దుర్గంలో వరలక్ష్మీ అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్పలకు చెందిన వరలక్ష్మీకి రెండేళ్ల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన శ్రీకాంత్‌త్‌తో వివాహమైంది.

వీరికి సంతానం లేదు.. భర్త మద్యానికి బానిసకావడమే కాకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిని తట్టుకోలేకపోయిన వరలక్ష్మీ భర్తతో వాదనకు దిగేది. కాగా ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

భర్త ఏమన్నాడో తెలియదు కానీ... ఆమె శనివారం రాత్రి ఇంటిలోని పైకప్పు కడ్డికీ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో శ్రీకాంత్ ఇంట్లో లేకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.