ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. తనపై అనుమాన పడుతున్నాడనే కారణంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని తండ్యాం పంచాయతీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..... తండ్యాం పంచాయితీలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మేదరమెట్ల వెంకట రమణ, సంధ్యలు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసుగల పాప కూడా ఉంది. కాగా.. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ప్రతి చిన్న విషయానికీ భర్త అనుమానిస్తున్నాడనే బాధతో సంధ్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈ మేరకు సుసైడ్ నోట్ కూడా రాసింది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యేనని సంధ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు తమ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని.. ఉదయం లేచి చూసేసరికి.. భార్య ఉరివేసుకొని కనిపించిందని వెంకట రమణ పోలీసులకు తెలిపారు.