అమరావతి : అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట గుంటుపల్లి భారతి(30) అనే వివాహిత మృతి చెందింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ఎదుటే తుదిశ్వాస విడిచింది.

ఈ రోజు తెల్లవారుజామునుండి చికిత్స కోసం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నారు. 8 గంటలకు 108 వాహనం వచ్చింది. అందులోని సిబ్బంది భారతిని పరీక్షించి మరణించినట్లు నిర్దారణ చేశారు. 

అయితే భారతి కరోనాతో మృతి చెందిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి ఇప్పటివరకు పి.హెచ్.సి.ఎదుటే  మృతదేహం ఉంది. 

విషయం తెలిసినా అధికారులు ఏ మాత్రం స్పందించలేదు. తెల్లవారుజామున వచ్చినా పట్టించుకోకపోవడంతోనే తన కూతురు మృతి చెందిందని తల్లి రోదిస్తోంది.