పెళ్లైన నాటి నుంచే అతని కన్ను కట్టుకున్న భార్యపై కన్నా ఎక్కువగా ఆమె చెల్లెలిపైనే ఉండేది. భార్యకు అనారోగ్యం వచ్చిన ప్రతిసారీ  సాకుతో అత్తారింటి నుంచి మరదలిని తన ఇంటికి తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో మరదిలికి నరకం చూపించేవాడు. తెలీకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి వికృతానందం పొందేవాడు. దాదాపు పది సంవత్సరాలుగా అక్క మొగుడు పెడుతున్న నరకం భరిస్తూ వచ్చిన ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన ఓ మహిళకు 2010లో  అదే గ్రామానికి చెందిన కె.రవికిరణ్ తో వివాహం జరిగింది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది. అక్క పెళ్లి నాటికి బాలిక వయసు 15ఏళ్లు కావడం గమనార్హం. 

అత్తారింటికి వెళ్లిన అక్క.. ఎప్పుడు అనారోగ్యానికి గురైనా.. సదరు బాలికను పనులు చేసిపెట్టడానికి పిలిచేవారు. ఆనాటి నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. తెలిసీ తెలియని వయసులో ఈ విషయం ఎవరికి చెప్పాలో బాలికకు అర్థం కాలేదు. భర్త చేస్తున్న అకృత్యాన్ని భరించలేక ఓసారి ఎదురు తిరిగింది. దీంతో... మీ అక్క జీవితం నాశనమౌతుంది అని బెదిరించడంతో.. గమ్మునుండిపోయింది.

Also Read ఆవేశంలో భార్యను చంపేశాడు.. ఆ తర్వాత భయంతో..

ఈ క్రమంలో 2018 జూలైలో ఆమెను తమిళనాడులోని వేళాంగిణి దేవాలయానికి తీసుకువెళ్లి బలవంతంగా తాళి కట్టి కామ కోర్కెలు తీర్చుకున్నాడు. తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో రవికిరణ్‌ యువతితో కలిసి తెనాలి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇష్టపూర్వకంగా తానే వెళ్లానని యువతితో చెప్పించాడు. అప్పటి నుంచి యువతి అక్కను రవి కిరణ్‌ రోజూ కొట్టడం ప్రారంభించాడు. 

తల్లిదండ్రులకు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి.. తన అక్కను మరింత వేధించడం మొదలుపెట్టాడు. సదరు  యువతి నగ్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి వారిని ఇరకాటంలో పెట్టాడు. దీంతో అతని వేధింపులు తాళలేక సదరు యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.