తాళికట్టడానికి నిమిషం ముందు.. వధువుపై అనుమానం

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 3, Sep 2018, 11:38 AM IST
marriage cancelled last minute when bride grom suspected bride
Highlights

వరుడుు.. వధువు మెడలో తాళికడతారని అందరూ ఎదురుచూస్తుండగా.. పీటల మీద నుంచి పక్కకి వచ్చాడు పెళ్లి కొడుకు. తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని పేర్కొనడం గమనార్హం

పెళ్లికి ఇరు కుటుంబాలు సిద్ధమైపోయాయి. అన్ని ఏర్పాట్లు చేశారు. బంధు, మిత్రులంతా పెళ్లికి ఆనందంగా హాజరయ్యారు. మరో నిమిషంలో వరుడుు.. వధువు మెడలో తాళికడతారని అందరూ ఎదురుచూస్తుండగా.. పీటల మీద నుంచి పక్కకి వచ్చాడు పెళ్లి కొడుకు. తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...పామర్రు మండలం నిభానిపూడికి చెందిన నాగశ్రీనుకి తోట్లవల్లూరు వాసి దివ్యకు రెండు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. సెప్టెంబర్‌ 2న పెళ్లి కుదుర్చుకున్నారు.

ఈ క్రమంలో ఆదివారం పెళ్లి పీటలకు వరకు వచ్చిన నాగశ్రీను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి కూతరు కుటుంబ సభ్యులు తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పెళ్లి కొడుకు వాళ్ల తల్లితండ్రులు మాటలు విని తనపై లేనిపోని అబాండాలు మోపి, అనుమానపడి పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోయాడని పెళ్లికూతురు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బంధువులతో కలిసి తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించింది.  ఈ సమస్యను  పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

loader