విశాఖపట్టణం: విశాఖపట్టణం ఏజెన్సీలో మావోయిస్టులు సోమవారం నాడు మందుపాతర పేల్చారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు.

ఏవోబీలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఇవాళ మందుపాతరను పేల్చారు. ఈ మందుపాతర పేలుడులో భద్రతా బలగాలు సురక్షితంగా తప్పించుకొన్నారు.

మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఆంద్రా ఒడిశా బోర్డర్ లో కొంత కాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ ను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. 

మల్కన్ గిరి కటాప్ ఏరియాలో భారీ ల్యాండ్ మైన్ ను ఇవాళ మావోయిస్టులు పేల్చారు. ఈ ల్యాండ్ బ్లాస్టింగ్ తో విశాఖ జిల్లాలోని పెద బయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నాయి.

కూంబింగ్ కు వస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు పాతరలను ఏర్పాటు చేశారు. అయితే మావోయిస్టుల మందుపాతరను పేల్చినప్పటికి పోలీసులు ఈ ఘటనలో తృటిలో తప్పించుకొన్నారు.

చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విశాఖ జిల్లాలో  అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తర్వాత కూడ ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.